Sunday, May 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా..

జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ల ధర్నా..

- Advertisement -

ఎమ్మెల్యే స్పందించాలని నినాదాలు
నవతెలంగాణ-వర్ధన్నపేట
గత ఐదు నెలలుగా వర్ధన్నపేట ఆకేరు పరివాహక ప్రాంతాల ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లు కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్లను నిషేధించడంతో డ్రైవర్లు కార్మికులు ఆదివారం రోజున ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం వరంగల్ రహదారిపై గంటపాటు ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ఇసుక ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు కార్మికులు ఆందోళన నిర్వహించారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు స్పందించాలని, ధర్నా వద్దకు రావాలని, అసెంబ్లీలో ఇసుక ట్రాక్టర్ యజమానులకు కార్మికులకు ఉపాధి కల్పించాలని, మాట్లాడిన మాట ప్రకారంగా ఆదుకోవాలన్నారు. మూడు మండలాలకు చెందిన పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేశారు. పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల వాగుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్వతగిరి – ఐనవోలు వర్ధన్నపేట మండలాలలో పలు గ్రామాల నుంచి సుమారు 5000 మందికి ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. ఆకేరు వాగుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తమకు పని లేక ట్రాక్టర్ల ఈఎంఐలు కుటుంబ పోషణ గడవక అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తమ కుటుంబాలను ఆదుకుని ఇసుకకు అనుమతి ఇవ్వాలన్నారు. ధర్నాతో రోడ్డు ఇరు వైపులా ట్రాఫిక్ స్తంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -