ఆందోళనలో కుబీర్ రైతులు..
పట్టించుకోని అధికార యంత్రాంగం
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు ఎంతో కష్ట పడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో నే అగ్ని ప్రమాదాలు సంబవించి వందల ఎకరాల్లో మొక్క జొన్న పంటలు కాలిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి మండలంలో వరుసగా మొక్కజొన్న పంటకు వివిధ కారణాలవల్ల అగ్ని ప్రమాదాలు సంభవించి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట రైతుల కళ్ళ ముందే బూడిద కావడంతో రైతులు చేసేది ఏమీ లేక కంటితల్లి పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గత రెండు రోజుల క్రితం ఓకే ఈరోజు దార్ కుభీర్, పార్డి కే, నిగ్వ మూడు గ్రామాలలో దాదాపుగా 42 ఎకరాలలో మొక్క జొన్న, జొన్న వంటలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలు సంభవించి కాలి బూడిద అయ్యాయి. దీంతో అది మరవక ముందే మళ్లీ ఆదివారం మండలంలోని రంజిని తండా గ్రామ శివారులో నిల్వ ఉంచిన మొక్క జొన్న కుప్పలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం వల్ల ఒక్కసారిగా కాలిపోయాయి. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి వ్యవసాయ బోరు మోటర్ నుంచి నీళ్లు పొసే ప్రయత్నం చేయడంతో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మండలంలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వరుసగా మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



