Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమానిత వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

అనుమానిత వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

- Advertisement -


నవతెలంగాణ – రాయపర్తి: మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనుమానిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ సూచించారు. గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని చెబుతూ కొంతమంది కొత్త వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు తమకు సమాచారం అందుతోందని తెలిపారు. కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఫోటో అప్లోడ్ చేయాలని, మెడలో ఉన్న బంగారు ఆభరణాలను పక్కన పెట్టాలని, బంగారం ఉంటే ఉచితంగా గ్యాస్ ఇవ్వబోరని చెప్పి ప్రజలను మభ్యపెట్టి దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎస్సై పేర్కొన్నారు. అలాగే గ్యాస్ ఈ-కేవైసీ, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి రుణాలు, క్రాప్ లోన్లు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని వచ్చే గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై ముత్యం రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -