Sunday, May 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట

వందెకరాల్లో కాలి బూడిదనై జొన్న, మొక్కజొన్న పంట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టలో ఆదివారం ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్న జొన్న, మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. పంట పొలాలలో ఉన్న మోటార్లకు ఉన్న కేసింగ్ పైపులు, వైర్లు, పదుల సంఖ్యలో పైపులు కాలిపోవడంతో లక్షల్లో ఆస్థి నష్టం సంభ‌వించిందని బాధిత రైతులు పేర్కొన్నారు. వ్యవసాయ భూములలో ఉన్న పంటలు కాలిపోతున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆలుగాలం కష్టపడి చేతికి వచ్చిన జొన్న, మొక్క జొన్న పంటలు రైతుల కండ్ల ముందరే కాలిపోతుండడంతో రైతులు, వారి కుటుంబికులు కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -