– జుక్కల్ ఏవో మహేశ్వరి వెల్లడి
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రైతులకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ.. మండలంలోని పెద్దగుల్లా, పెద్ద ఏడ్గి , హంగర్గా , నాగల్ గావ్, ఖండేబల్లూర్, డోన్ గౌడ , కౌలాస్ ఏడు క్లస్టర్ల పరిధిలోని గ్రామంలోని రైతులతో వ్యవసాయ అనుబంధ సంస్థలైన హార్టికల్చర్, వెటర్నరీ, ఇరిగేషన్, పాడి పరిశ్రమ, వ్యవసాయ రుణాలు ఇచ్చే బ్యాంకుల అధికారులు, వివిధ రకాలైన అనుబంధ సంస్థల అధికారులతో ఆరు రోజుల పాటు ఒక్కొక్క క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాలు మే నాల్గవ తేదీ నుండి మే 9వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. నాలుగవ తేదీన నేల ఆరోగ్య సమస్యల పరిరక్షణ, సమతుల్య ఎరువులు యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, వినియోగదారులు కోరుకుని వరి రకాల సాగు, ఐదవ తేదీన ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదల పంటల సాగు, ఆరవ తేదీన వ్యవసాయ క్షేత్రాలు, సోలార్ విద్యుత్ కేంద్రాలు పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రికరణ – డోన్, ఆరవ తేదీన బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు , సహకార సంఘాలు , ఎఫ్బి ఓల ద్వారా రైతులకు సేవలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, ఏడవ తేదీన వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం వ్యవసాయ యాంత్రికరణ కేంద్రం, 8వ తేదీన పశుసంవర్ధక శాఖ , పాడి పరిశ్రమ , పశువుల జాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణ, నీటిపారుదల శాఖ, సమర్థ నీటి విడుదల కై గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాలు, మరమ్మత్తులు, కాలువలలో కంప చెట్లు తొలగింపు, గుర్రపు డెక్కల తొలగింపు, 9వ తేదీన నీటిపారుదల శాఖలు చెరువులలో కంప చెట్లు మరియు గుర్రపు డెక్కల తొలగింపు , సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.



