నవతెలంగాణ–పరకాల : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో ప్రయివేటు వాహనదారులు, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరకాల సీఐ క్రాంతికుమార్ వెల్లడించారు. ఆగస్టు 16న సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.
హుజూరాబాద్ రోడ్డు నుంచి భూపాలపల్లి వైపు వెళ్లే ప్రైవేట్ వాహనాలు మొగుళ్లపల్లి ‘ఎక్స్’ రోడ్డు నుంచి మాదారం కాలనీ సీసీ రోడ్డు, సీఐఎస్‌ఐ కాలనీ రోడ్డు, జయ్ కాన్వెంట్ స్కూల్ మీదుగా ఎన్‌హెచ్–353సీకి చేరుకోవాలని సీఐ సూచించారు. భూపాలపల్లి రోడ్డు నుంచి హుజూరాబాద్ వైపు వెళ్లే వాహనాలు జయ్ కాన్వెంట్ స్కూల్ నుంచి సీఐఎస్‌ఐ కాలనీ రోడ్డు, మాదారం కాలనీ సీసీ రోడ్డు, మొగుళ్లపల్లి ‘ఎక్స్’ రోడ్డు మీదుగా హుజూరాబాద్ రోడ్డుకు చేరుకోవాలని తెలిపారు.
హనుమకొండ రోడ్డు నుంచి హుజూరాబాద్ వైపు వెళ్లే ప్రైవేట్ వాహనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, బీసీ కాలనీ, న్యూ మున్సిపల్ కార్యాలయం, వెలిపల్లి రోడ్డు, సీతారాంపూర్, నర్సక్కపల్లి ‘ఎక్స్’ రోడ్డు మీదుగా హుజూరాబాద్ రోడ్డుకు చేరుకోవాలని సూచించారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు నర్సక్కపల్లి ‘ఎక్స్’ రోడ్డు, సీతారాంపూర్, వెలిపల్లి రోడ్డు, న్యూ మున్సిపల్ కార్యాలయం, బీసీ కాలనీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీదుగా హనుమకొండ రోడ్డుకు చేరుకోవాలని తెలిపారు.
సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, రోడ్లపై వాహనాలను ఇష్టారీతిన నిలపకుండా పోలీసులకు సహకరించాలని సీఐ క్రాంతికుమార్ కోరారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



