- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాకు పరోక్షంగా ప్రచారం చేస్తున్నందున వీరికి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ తుకారామ్ ముంఢే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ ప్రచారంలో భాగస్వామ్యాన్ని నిలిపివేయాలని.. ప్రచార కంటెంట్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని నటులను ఆదేశించారు.
- Advertisement -



