- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్ లో పోటీ తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లకు టీవీకే గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అస్సాంలో బీజేపీ, పుదిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.





తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 108 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే 52, అన్నాడీఎంకే 74 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
- పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు గానూ.. బీజేపీ 187 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 99 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 5 స్థానాలకు పరిమితమైంది.
- కేరళలో 140 స్థానాలుండగా.. యూడీఎఫ్ 95 చోట్ల ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 41 స్థానాల్లో, ఎన్డీయే 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
- అస్సాంలో 126 స్థానాలుండగా.. బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 27 చోట్ల ముందంజలో ఉంది.
- పుదుచ్చేరీలో 30 స్థానాలకు గానూ ఎన్నార్ కాంగ్రెస్+ 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 9 చోట్ల ముందంజలో ఉంది.
- Advertisement -



