నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. రసాయన ఎరువులు మోతాదులో వాడుకోవాలని, భూసార పరీక్షలు చేసుకోవాలని, ముఖ్యంగా సాగులో అధికారుల సలహాలు పాటించాలని తెలిపారు. అనంతరం కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకున్నారని, వాటికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, మండల వ్యవసాయ అధికారి రాజు, రైతు వేదిక క్లస్టర్ ఏఈఓ సౌమ్య, రైతులు పాల్గొన్నారు.
భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



