హీరో హవీష్ నటిస్తున్న తాజా సినిమా ‘నేను రెడీ’. త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూడో సింగిల్ ‘మస్తుగుందిరా యవ్వారం’ను విడుదల చేశారు. లైవ్లీ ఫోక్ బీట్స్‌ను క్యాచీ పాప్ సౌండ్స్‌తో కలిపి రూపొందించిన ఈ పాట మొదటి నుంచే ఎనర్జిటిక్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన ఈ పాటలో డ్రమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ఆధునిక సింథ్స్, హుక్స్‌ను చక్కగా మిక్స్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం యూత్‌ఫుల్‌గా, సరదాగా, ఫ్లర్టీగా సాగుతూ ప్రేమ, యవ్వనం, యాటిట్యూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. అనురాగ్ కులకర్ణి, మానసి ఎరబతినీ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.
విజయ్ పోలాకి కొరియోగ్రఫీ పాటకు మరో హైలైట్‌గా నిలిచింది. మాస్ కమర్షియల్ డ్యాన్స్ స్టెప్స్‌ను ఫోక్ ఫ్యూజన్ మూవ్‌మెంట్స్‌తో మిక్స్ చేసి హై ఎనర్జీతో రూపొందించారు. హవీష్, కావ్య థాపర్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఎనర్జీ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
మాస్ బీట్‌తో ‘మస్తుగుందిరా యవ్వారం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



