ఎలన్, శాన్వీ మేఘన హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత శ్రీనిధి సాగర్ మాట్లాడుతూ, ‘ఇది నెట్‌ఫ్లిక్స్‌లో నా రెండో సినిమా. ఈ ఏడాది మార్చిలో ‘మేడిన్ కొరియా’ అనే సినిమాను రిలీజ్ చేశాం. మా తొలి సినిమాలాగానే ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని భావిస్తున్నాం. ఓ సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ కోణంలో చెప్పే ప్రయత్నం చేశాం. ఎలన్ మా బ్యానర్‌లో చేసిన రెండో సినిమా ఇది. మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు. తనతో మా జర్నీ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. శాన్వీ మేఘన ఎంతో చక్కగా చేశారు’ అని అన్నారు. ‘నా తమిళ సినిమా ట్రైలర్ తెలుగులో రిలీజ్ అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. నేను నటించిన ‘పిట్ట కథలు’ అనే అంథాలజీ నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజైంది. తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో నా సినిమా రిలీజ్ అవుతుంది. అబ్బాయి పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి వస్తే ఎలాంటి బాధలు పడతాడనేది సినిమాలో చూస్తారు. ఈనెల 21న సినిమా రిలీజ్ అవుతుంది’ అని హీరోయిన్ శాన్వీ మేఘన చెప్పారు. హీరో, డైరెక్టర్ ఎలన్ మాట్లాడుతూ, ‘నేను ఎప్పటి నుంచో తెలుగు సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాతో అది నిజమవుతుంది. నా నిర్మాత సాగర్, నెట్‌ఫ్లిక్స్ సంస్థకు థాంక్స్. నేను కలిసిన వాళ్లలో శాన్వీ బ్యూటీఫుల్ పర్సన్. 32 రోజుల్లో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. తెలుగు వాళ్లు మా సినిమా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు’ అని అన్నారు.
ఆద్యంతం వినోదభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



