Monday, May 4, 2026
E-PAPER
Homeజాతీయంభబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్

భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పశ్చిమ బెంగాల్‌లోని భబానీపూర్ కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద హైటెన్ష‌న్ నెల‌కొంది. టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ భవానిపూర్ నుంచి బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే. అక్క‌డ నుంచి బీజేపీ అభ్య‌ర్థి సువేద అధికారి పోటీ చేస్తున్నారు. ఇరువురు మ‌ధ్య హోరాహోరీ పోటీ నెల‌కొంది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు ముగియ‌గా..మ‌మ‌త ఆధిక్యంలో కొన‌సాగుతుంది. ఈక్ర‌మంలోనే ఆ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన‌ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ కౌంటింగ్ హాల్‌ను మమతా బెనర్జీ సందర్శించారు. కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ఇప్ప‌టికే బెంగాల్‌లో బీజేపీ మోజార్టీలో ఉంది. 294 అసెంబ్లీ స్థానాల‌కు బీజేపీ 201 స్థానాల్లో ముందంజ‌లో ఉంది, 86 సీట్ల‌ల్లో టీఎంసీ కొన‌సాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -