Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూసార పరీక్షలు చేయించుకోండి

భూసార పరీక్షలు చేయించుకోండి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
వ్యవసాయ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట సాగులో రసాయన ఎరువులు తగ్గిస్తూ మోతాదులో వాడుకోవాలని వ్యవసాయ అధికారులు వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ప్రతి రైతు వేదికలో క్లస్టర్ల పరిధి రైతులతో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ రైతులకు వ్యవసాయం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులు వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని కోరారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడితే భూములు చెడిపోయే ఆస్కారం ఉంటుందని, పంట దిగుబడి కోసం ఇష్టానుసారంగా ఎరువులు వాడొద్దని, పంటల సాగు గురించి వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి ఎరువులు వాడాలని తెలిపారు. మేనూర్ మద్నూర్ రైతు వేదికలో జరిగిన రైతు వారోత్సవాల్లో మండల వ్యవసాయ అధికారి రాజు, మేనూర్ ఏఈఓ విశాల్ గౌడ్, ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మల్కాజి ,అదే విధంగా పెద్ద తడగూర్ రైతు వేదికలు జరిగిన వారోత్సవాల్లో ఏఈఓ అనిల్ ,ఆ గ్రామ సర్పంచ్ శాంతాబాయి ఈరన్న ,అంతాపూర్, చిన్న తడుగూరు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కొడిచెర రైతు వేదికలో ఆ క్లాస్టర్ ఏఈఓ సమత, ఆ గ్రామ సర్పంచ్ ఆయా క్లస్టర్ల పరిధిలోని వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -