కేంద్రాల్లో ఆలస్యంగా కొనుగోళ్లు
ఎండలోనే రైతుల పడిగాపులు : ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సిద్దిపేటరూరల్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో లేని ఇబ్బందులు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేటరూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంటల కొనుగోళ్లు జరిపి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైౖతులను తిప్పలు పెడుతున్నదని విమర్శించారు. వడ్లు, మక్కలు కొనుగోలు కేంద్రాలకు వచ్చి 22 రోజులు గడుస్తున్నా.. కొనుగోళ్లు మాత్రం చేయడం లేదన్నారు. దాంతో రైతులు రోజుల తరబడి ఎండలోనే కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
అప్పుడు లేని తిప్పలు ఇప్పుడెందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



