నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బీహార్(బంకిపూర్), మధ్యప్రదేశ్(Datia), గుజరాత్(మంజల్‌పూర్)లలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్ లోని బంకిపూర్ స్థానం నుంచి జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో బంకిపూర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది.
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీజూలై 13 (సోమవారం)కాగా, నామినేషన్ పత్రాల పరిశీలన జూలై 14 (మంగళవారం)న జరగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా కు జూలై 16 (గురువారం) వరకు గడువు ఉంటుంది. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జూలై 30న జరుగుతుంది.



