నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధంతో ప్రముఖ హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య రాకపోకలు స్తంభించిన విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధి నియంత్రణపై రెండు దేశాల మాటల యుద్ధం నడుస్తోంది. హర్మూజ్ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. మాటలతో జలసంధిని ఆధీనంలోకి తీసుకోలేరని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పొస్టు చేశారు.ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాము బెదిరింపులకు భయపడబోమని.. సైనిక ప్రదర్శనలకు లొంగబోమని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే.. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు. తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని ఆయన స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై పూర్తి నియంత్రణ అమెరికాదేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ (Iran) ఖండించింది. జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని.. దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని పేర్కొంది. హర్మూజ్‌ను మూసి ఉంచాలా? తెరవాలా? అనేది తమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ (Kazem Gharibabadi) తెలిపారు. యుద్ధ నౌకల మోహరింపు ద్వారా జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అగ్రరాజ్యం తన భ్రమలను విడిచిపెట్టి.. ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాము బెదిరింపులకు భయపడబోమని.. సైనిక ప్రదర్శనలకు లొంగబోమని స్పష్టం చేశారు.
హర్మూజ్ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే.. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు. తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని స్పష్టం చేశారు. హర్మూజ్ విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేస్తోందన్నారు.
ట్రంప్ ఏమన్నారంటే..?
యుద్ధంలో ఇరాన్‌ను ఓడిస్తామని.. ఆ దేశం ఓటమిని చవిచూసిన అనంతరం హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని శనివారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ (US President Trump) పేర్కొన్నారు. ఆ దేశం వద్ద అణ్వాయుధ సామర్థ్యం ఉండడం ఎప్పటికైనా ప్రమాదమేనని.. అందుకే దానిని నాశనం చేయాలనే లక్ష్యంతో యుద్ధానికి దిగినట్లు వెల్లడించారు.



