– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ పిట్టల అర్జున్
నవతెలంగాణ-అశ్వారావుపేట
బ్రిటిష్ అరాచక పాలన అంతం కావాలని 200 ఏళ్లకు పైగా ప్రాంతాలు, మతాలకు అతీతంగా ఎందరో చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సీఐటీయూ ఆధ్వర్యంలో దమ్మపేట కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వరాజ్యం సాధించి 80 ఏళ్లు గడిచినా పాలకుల విధానాల ఫలితంగా పేదరికం, ధరలు, నిరుద్యోగం పెరిగాయని అన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడటంతోపాటు ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు.
ప్రజా సమస్యలపై నికరంగా పోరాడుతున్నది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. కమ్యూనిస్టులు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టు విధానం, ఎజెండా బలంగా ఉందన్నారు. పోరాటాల ద్వారానే స్వాతంత్ర్య ఫలాలను ప్రజలందరికీ అందించి ఆర్థిక, సామాజిక న్యాయం సాధించగలమని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, కవులూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



