Sunday, July 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేటీఆర్ కాన్వాయ్‌కి ప్రమాదం..

కేటీఆర్ కాన్వాయ్‌కి ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లికి వెళ్తుండగా స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్ల ముందు, వెనుక భాగాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక కారులో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. తోటి నాయకులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కేటీఆర్ కాన్వాయ్‌ను నిలిపివేసి, శంభీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -