Sunday, August 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆయిల్‌ఫెడ్ నర్సరీని సందర్శించిన కోస్టారికా నిపుణులు

ఆయిల్‌ఫెడ్ నర్సరీని సందర్శించిన కోస్టారికా నిపుణులు

- Advertisement -

పలు ఆంశాలు వివరించిన
 ఆయిల్ ఫెడ్ డీఓ శంకర్
నవతెలంగాణ-అశ్వారావుపేట

ఆయిల్‌పామ్‌ సాగులో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కోస్టారికాకు చెందిన నిపుణుల బృందం శనివారం అశ్వారావుపేటలోని టీజీ ఆయిల్‌ఫెడ్‌ కేంద్రీయ నర్సరీని సందర్శించింది. నర్సరీలో మొక్కల పెరుగుదల, ఆరోగ్య పరిస్థితులు, నిర్వహణ పద్ధతులను పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాథమిక దశలో పెరుగుతున్న ఆయిల్‌పామ్‌ మొక్కలను పరిశీలించిన కోస్టారికా నిపుణులు, మొక్కల నిర్వహణ తీరు బాగుందని అభినందించారు. ద్వితీయ దశలో చేపడుతున్న గ్రేడింగ్‌ విధానం, మొక్కల నాణ్యతా ప్రమాణాలు తమ నర్సరీల్లో అనుసరిస్తున్న ప్రమాణాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. నర్సరీలో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రశంసించారు.టీజీ ఆయిల్‌ఫెడ్‌ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం, విధుల పట్ల అంకితభావాన్ని నిపుణుల బృందం అభినందించింది. భారతదేశంలో ఆయిల్‌పామ్‌ సాగు అభివృద్ధికి టీజీ ఆయిల్‌ఫెడ్‌ చేస్తున్న కృషి ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంది. భవిష్యత్తులో సాంకేతిక సహకారం, విత్తనాల మార్పిడికి ఆసక్తి వ్యక్తం చేసింది.​ ఏఎస్డీ కోస్టారికా ఆయిల్‌పామ్‌ విత్తనాలు, క్లోన్ల అభివృద్ధి, సాంకేతిక సేవల్లో అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.​కోస్టారికాలోని ఏఎస్డీ సంస్థ టెక్నికల్‌ సర్వీసెస్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఇంజినీర్‌ జోక్విన్‌ టోర్రెస్‌ అక్యూనా ఈ బృందానికి నేతృత్వం వహించగా, మేనేజర్ శాన్ జోస్, టీజీ ఆయిల్‌ఫెడ్‌ డీఓ శబావత శంకర్‌, నర్సరీ ఇన్‌‌చార్జి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -