ఉపాధ్యాయులకు టీపీటీఎఫ్ పిలుపు
నవతెలగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల సమస్యల సాధన కోసం టీఈజేఏసీ సెప్టెంబర్ 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) పిలుపునిచ్చింది. శుక్రవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అధ్యక్షతన హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు పి.నాగిరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నారాయణమ్మ, డి.శ్రీనివాస్, యం.లక్ష్మయ్య యాదవ్, బి.రాజు, రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగరావు, రావుల రమేష్, ఎస్.విజయ్, డి.రాజయ్య, ఎస్.కవితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతిలు మాట్లాడుతూ సమాజంలో ఉద్యోగులను పలుచన చేసే విధంగా సీఎం మాట్లాడటం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం హామీ ఇచ్చిన పీఆర్సీ ప్రకటించలేదనీ, ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయలేదనీ, సీపీఎస్ రద్దు కాలేదనీ, హెల్త్ కార్డుల అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదని తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రూపొందించకపోవడంతో విద్యారంగంలో పర్యవేక్షక పోస్టులు ఖాళీలు భర్తీ చేయలేక పర్యవేక్షణ కొరవడిందని చెప్పారు. బాహ్య మూల్యాంకన ఉత్తర్వలను రద్దు చేయాలనీ, జీవో 25ను సవరించాలని వారు కోరారు. ఉపాధ్యాయుల బదిలీల, ప్రమోషన్ల షెడ్యూల్‌ను విడుదల చేయాలనీ, 2010 కి ముందు నియామకమైన టీచర్లకు టెట్ ను రద్దు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, వేతన స్కేళ్ళు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పండిట్, పి.ఈ.టి. పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలనీ, 317 జి.ఓ బాధిత ఉపాధ్యాయులకు 190 జి.ఓ. ఆధారంగా తాత్కాలిక బదిలీలను చేపట్టాలని, మిగిలిన స్పౌజ్ కేటగిరి టీచర్లకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
చలో హైదరాబాద్‌కు తరలిరండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


