Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌డేటా, ఏఐ రంగాలదే భవిష్యత్‌

‌డేటా, ఏఐ రంగాలదే భవిష్యత్‌

- Advertisement -

కాన్‌‌స్టర్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

డేటా, ఏఐ రంగాలదే భవిష్యత్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు (కేటీఆర్) అన్నారు. డేటా, ఏఐ, కంటెంట్ రంగాలకు స్వర్ణయుగం రాబోతోందని చెప్పారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ ప్రైమియా భవనంలో శుక్రవారం కాన్‌స్టర్ సొల్యూషన్స్ కంపెనీ నూతన కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు కంపెనీ కార్యకలాపాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోందనీ, ముఖ్యంగా డేటా సెంటర్లు, సర్వర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), కంటెంట్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ రెండు రంగాల కోణాల నుంచి గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని అత్యంత దగ్గరగా చూసిన అనుభవంతో చెబుతున్నాననీ, ప్రస్తుతం ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి అద్భుతమైన భవిష్యత్ ఉందని చెప్పారు. నేటి తరం సమాచారాన్ని పొందే విధానమే పూర్తిగా మారిపోయిందని అన్నారు. గతంలో వార్తాపత్రికలను పేజీ పేజీగా చదివే రోజులు ఉండేవనీ, ఇప్పుడు యువతరం మొబైల్ ఫోన్‌లో ఒక్కోసారి స్వైప్ చేస్తూ ప్రపంచాన్ని చూస్తోందని వివరించారు. ప్రతి స్వైప్ వెనుక భారీ స్థాయిలో కంటెంట్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ జరుగుతోందనీ, ఈ డిజిటల్ విప్లవంతో డేటా, స్టోరేజ్ రంగాల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ టైర్-2, టైర్-3 నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కేటీఆర్ చెప్పారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకులు, నాయకత్వ బృందం, ఉద్యోగులందరికీ కేటీఆర్ అభినందనలు చెప్పారు. ఈ సంస్థ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -