Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘చెత్త సేకరణ’నురాంకీకి అప్పగించొద్దు

‘చెత్త సేకరణ’నురాంకీకి అప్పగించొద్దు

- Advertisement -

ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
లేదంటే సీఎం ఇంటి ముందే 
1000 ఆటోల చెత్త పోస్తాం : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

చెత్త సేకరణ కాంట్రాక్టును రాంకీ సంస్థకు అప్పగించే యోచనను విరమించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేకుంటే వెయ్యి స్వచ్ఛ ఆటోల చెత్తను సీఎం ఇంటి ముందు పోస్తామని ఆమె హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆమె స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం రాంకీ సంస్థకు చెత్త సేకరణ బాధ్యతలు అప్పగిస్తోందని, ప్రాపర్టీ ట్యాక్స్ లో కలిపి చెత్త పైసలు వసూలు చేస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని కార్మికులు ఆమెతో వాపోయారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాంకీ సంస్థకు లాభం చేయడానికి స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారిని రాంకీ సంస్థకు జీతగాళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. స్వయం ఉపాధి ద్వారా మంచి ఆదాయం పొందుతున్న వారికి నెలకు రూ.16 వేలు మాత్రమే జీతం ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తప్పుపట్టారు. హైదరాబాద్ లో 20 వేల ఆటోల ద్వారా 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులు ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. చెత్త సేకరణ యథావిధిగా కార్మికులతోనే చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు. రాంకీ సంస్థ నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై సీఎం స్పష్టత నివ్వాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -