Saturday, September 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం ముగిస్తుందా..?

యుద్ధం ముగిస్తుందా..?

- Advertisement -

అమెరికా ప్రతినిధుల పర్యటన..రష్యాకు జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదన
మాస్కో:
రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం చివర్లో అమెరికా రాయబారులు జరేద్‌ కుష్‌నర్‌, స్టీవ్‌ విట్‌కాఫ్‌ ఇరుదేశాల్లోనూ పర్యటించనున్నారు. యుద్ధాన్ని ముగించే అంశంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదన చేశారు. తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని రష్యాను కోరారు. అమెరికా రాయబారుల పర్యటన సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. రష్యా ఇటీవల కాలంలో పట్టపగలే.. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అమెరికా రాయబారుల పర్యటనను జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. వారు శనివారం మాస్కోలో, ఆదివారం కీవ్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అగ్రరాజ్యం నుంచి సమాచారం అందినట్లు టెలిగ్రామ్ వేదికగా వెల్లడించారు. తమవైపు నుంచి ఎలాంటి దాడులు ఉండబోవని, రష్యా కూడా సంయమనం పాటిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్.. రష్యా గురించి పట్టించుకోదని, అమెరికా రాయబారుల పర్యటన సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే తాత్కాలిక కాల్పుల విరమణ చేస్తున్నట్లు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ‘‘అమెరికా ప్రతినిధుల ప్రతిపాదనలు ఏంటో? వాటికి మాస్కో ఏమంటుందో చూద్దాం’’ అంటూ పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -