స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
2026-27 విద్యా సంవత్సరంలో సిలబస్‌ను పూర్తి చేసేందుకు కాలక్రమ పట్టికను కచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్, సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సిలబస్‌ను నిర్ణీత సమయం కంటే ముందు, ఆలస్యంగా పూర్తి చేయడంతో విద్యార్థుల అభ్యాస నాణ్యత దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో సూచించిన సమయం ప్రకారమే ప్రతి అధ్యాయాన్ని పూర్తి చేయాలని, సిలబస్‌ను ముందుగా పూర్తి చేయడం లేదా ఆలస్యం చేయడం అనుమతిం చబడదని తెలిపారు.
విద్యార్థులకు సబ్జెక్టుపై సరైన అవగాహన కలిగేలా బోధన సాగాలని, సిలబస్ పూర్తి చేయాలనే ఆరాటంలో పాఠాలను వేగంగా ముగించకూ డదని, తదుపరి అధ్యాయానికి వెళ్లేముందు, ప్రస్తుతం చెబుతున్న పాఠంలోని ముఖ్య ఉద్దేశాలు, అభ్యసనా ఫలితాలను విద్యార్థులు సాధించారో లేదో చూసుకోవాలని సూచించారు. ప్రతి చాప్టర్ పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా అసెస్‌మెంట్‌లు, తరగతి గది కత్యాలు, రివిజన్ నిర్వహించాలని తెలిపారు. హెడ్ మాస్టర్లు సిలబస్ పురోగతిని నిశితంగా పర్యవేక్షించాలని, ఉపాధ్యాయులు తమ రోజువారీ బోధనా పురోగతి రికార్డులను అప్డేట్ చేయాలని, విద్యార్థుల్లో అభ్యాస లోపాలుంటే, సాధారణ షెడ్యూల్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక బోధన ప్రణాళిక చేయాలని మార్గదర్శకాల్లో ఆదేశాలు జారీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఈ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు జరిగేలా జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సిలబస్ పూర్తికి టైంటేబుల్ పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



