Tuesday, May 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారతీయ జర్నలిస్టుల‌కు పులిట్జర్ అవార్డ్

భారతీయ జర్నలిస్టుల‌కు పులిట్జర్ అవార్డ్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇద్దరు భారతీయ జర్నలిస్టులను అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డ్ వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తీసుకువచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలు ఈ బహుమతికి ఎంపికయ్యారు. సచిత్ర రిపోర్టింగ్ అండ్ వ్యాఖ్యానం విభాగంలో వారు గెలుచుకున్నట్లు పులిట్జర్ వెబ్ సైట్ కటించింది. ఈ అవార్డును బ్లూమ్ బెర్గ్ కు చెందిన నటాలీ ఒబికో పియర్సతో పంచుకోనున్నారు. బ్లూమ్ బెర్గ్ లో ట్రాప్డ్’ అనే శీర్షికతో ప్రచురితమైన పరిశోధనాత్మక రిపోర్ట్ లో .. సాంకేతికతను వినియోగించి మోసగాళ్లు సామాన్యులను ఎలా ట్రాప్ చేస్తున్నారో, వారికి ఎదురయ్యే ప్రమాదాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఫోన్ ద్వారాడిజిటల్ అరెస్ట్ ‘కు గురైన భారతదేశంలోని న్యూరాలజిస్ట్ గురించి “చిత్రాలు,వ్యాఖ్యానం”తో , ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిఘా, డిజిటల్ మోసాల సవాళ్లను కళ్లకు కట్టినట్లు ఈ పరిశోధనాత్మక రిపోర్ట్ వివరించినట్లు అవార్డ్ వెబ్ సైట్ పేర్కొంది. కొలంబియా యూనివర్శిటీ పులిట్జర్ అవార్డ్ ను ప్రకటిస్తుంది. జర్నలిజం, సాహిత్యం, సంగీత స్వరకల్పనలో ఈ అవార్డును అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -