నవతెలంగాణ-హైదరాబాద్: చైనాలోని హునాన్ ప్రావిన్సులో ఉన్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల సుమారు 21 మంది మరణించారు. మరో 61 మంది గాయపడ్డారు. హువాషెంగ్ ఫైర్‌వర్క్స్ ప్లాంట్‌లో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం లియుయాంగ్ సిటీలో పేలుడు జరిగింది. సుమారు 3 కిలోమీటర్ల మేర దూరం వరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డ వారిని ట్రీట్ చేసేందుకు సుమారు 500 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. బిల్డింగ్‌లో ట్రాప్ అయిన వారిని రక్షించేందుకు రోబోలను వాడారు. పేలుడు ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫైర్‌వర్క్స్ కంపెనీ ఇంచార్జీని అదుపులోకి తీసుకున్నారు. బాణాసంచా ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న రెండు గన్‌పౌడర్ వేరౌజ్‌ల వల్ల రెస్క్యూ ఆపరేషన్ మరింత ఇబ్బందికరంగా మారింది. పేలుడు తీవ్రత ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న బిల్డింగ్ కిటికీలు ధ్వంసం అయ్యాయి. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. సెర్చ్ ఆపరేషన్‌కు ఆదేశించారు. బాధ్యులైన వారిని శిక్షించాలన్నారు.
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..21 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


