- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరాలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి కారణంగా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం గాయపడిన వారికి వైద్య సంరక్షణ అందేలా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను యూఏఈ సైన్యం అడ్డుకోగా, నాలుగో క్షిపణి సముద్రంలో కూలిపోయింది. ఈ దాడుల నేపథ్యంలో దుబాయ్, అబుదాబి నగరాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -



