Wednesday, May 6, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌లో వియత్నాం అధ్యక్షుడు ప‌ర్య‌ట‌న‌

భారత్‌లో వియత్నాం అధ్యక్షుడు ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ భారత మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్నారు. టో లామ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌‌లో అధ్యక్షుడు అయిన తర్వాత భారత పర్యటన ఇదే తొలిసారి. నేడు రాష్ట్రపతి భవన్‌‌కి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. నేడు టో లామ్‌, మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. అలాగే ఈ సమావేశంలో పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైనా చర్చించుకోనున్నారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

కాగా, మంగళవారం టోలామ్‌ ‌బీహార్‌‌లోని చారిత్రాత్మకమైన మహాబుద్ధి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీహార్‌ ‌ముఖ్యమంత్రి సామ్రాట్‌ ‌చౌదరి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -