Wednesday, May 6, 2026
E-PAPER
Homeజాతీయంపలాశ్ ముచ్చల్‌పై ‘అట్రాసిటీ’

పలాశ్ ముచ్చల్‌పై ‘అట్రాసిటీ’

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ పై మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ పరిణామం చోటుచేసుకుంది. విజ్ఞాన్ ప్రకాశ్ తన ఫిర్యాదులో పలాశ్ ముచ్చల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక సినిమా ప్రాజెక్టు పలాశ్ కోసం తన వద్ద నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నారని, అయితే ఆ తర్వాత తనను మోసం చేశారని విజ్ఞాన్ పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు 22న ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో పలాశ్ తన కులాన్ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో వివరించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు సాంగ్లీ పోలీసులు పలాశ్ ముచ్చల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. దీనిపై పలాశ్ ముచ్చల్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. పలాశ్ ముచ్చల్ వ్యక్తిగత జీవితం కూడా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆయన, క్రికెటర్ స్మృతి మంధాన మధ్య నిశ్చితార్థం జరిగి, పెళ్లి కూడా ప్లాన్ అయినప్పటికీ అనూహ్యంగా అది రద్దయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అప్పట్లో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిపై స్పందించిన పలాశ్, ఆధారాలు లేని వార్తలను నమ్మవద్దని, తన వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొన్నారు. అయితే తాజాగా నమోదైన అట్రాసిటీ కేసుతో పలాశ్ ముచ్చల్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -