నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్‌లో మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆర్మీ సంబంధించిన రెండు కార్యాలయాల ఎదుట ఈ పేలుళ్లు సంభవించాయి. జలంధర్‌లోని బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ దగ్గర తొలి పేలుడు ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బీఎస్ఎఫ్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ పేలింది. తొలుత ఆ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత అది పేలింది. సుమారు 300 మీటర్ల దూరం వరకు దాని ప్రభావం కనిపించింది. యాక్టివా స్కూటర్ పేలుడుకు చెందిన ఘటన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.
ఆ తర్వాత అర్థరాత్రి అమృత్‌సర్‌లో మరో పేలుడు ఘటన నమోదు అయ్యింది. ఖాసా రోడ్డులో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా సరిహద్దు గోడ వద్ద పేలుడు జరిగింది. గోడపై పెట్టిన ఓ షీట్ కిందపడిపోయింది.దేని వల్ల ఆ బ్లాస్ట్ జరిగిందో ఇంకా తెలియరాలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్వల్ప స్థాయి తీవ్రతతో పేలుడు జరిగిందని అమృత్‌సర్ రూరల్ ఎస్పీ సోహెల్ ఖాసిమ్ మీర్ తెలిపారు.



