Wednesday, May 6, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకేకు కాంగ్రెస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

టీవీకేకు కాంగ్రెస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజ‌య్ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైయ్యాయి. దీంతో విజ‌య్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుతున్న‌ట్లు కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. సోమ‌వారం వెలువ‌డిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీవీకే 107 స్థానాలు కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. మ్యాజిక్ ఫిగ‌ర్‌కు 10 సీట్ల దూరంలో ఉన్నంది. ప‌లు పార్టీల మ‌ద్ద‌తు కోసం టీవీకే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.

మ‌రోవైపు వామ‌ప‌క్షాల‌తో కూడా పొత్తు పెట్టుకోవ‌డానికి విజ‌య్ స‌న్నాహాలు చేస్తున్నారు. సిపిఐ(ఎం)లను టివికె అధ్యక్షుడు విజయ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సీట్లను గెలుచుకోగా, సిపిఐ(ఎం) రెండు సీట్లను గెలుచుకుంది.

కాగా, రెండు నియోజకవర్గాలైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ లలో టివికె అధ్యక్షుడు విజయ్ విజయం సాధించినప్పటికీ.. ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వున్నందున టివికె కు 107మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. దీంతో సభలో బలం 233కి పడిపోతుంది. మరోవైపు 117 సీట్ల మెజారిటీ సాధించేందుకు టివికెకు మరో పది మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -