Thursday, May 7, 2026
E-PAPER
HomeNewsటెంట్ హౌస్ లో పనిచేస్తూ ఇద్దరు బాల కార్మికులు మృతి

టెంట్ హౌస్ లో పనిచేస్తూ ఇద్దరు బాల కార్మికులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు!
టెంట్ హౌస్ సామానులు ఆటోలో సరఫరా చేస్తూ ఇద్దరు బాల కార్మికులలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలైన ఘటన మండల కేంద్రం బల్మూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బల్మూరు మండల కేంద్రంలోని ఓ టెంట్ హౌస్ లో గడెల కార్తీక్ (15 ), మందుల ధనుష్ కుమార్ (16) ఇద్దరు బాల కార్మికులు పనిచేస్తున్నారు. పనిలో భాగంగా గురువారం ఉదయం టెంట్ హౌస్ సామాన్లు తీసుకొని తిరిగి వస్తుండగా మండల పరిధిలోని నర్సాయపల్లి గేటు సమీపాన ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కార్తీక్, ధనుష్ కుమార్ తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి తల్లి పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై రాజేందర్ తెలిపారు. ఈ విషయమై ఆయా రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తూ బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని, తెలిసి తెలియని వయసులో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -