Thursday, May 7, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు

రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు

- Advertisement -

నవతెలంగాణ- మిరుదొడ్డి 
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ శివారులోని నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళ్తున్న బస్సు, ధర్మారం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, బస్సులో ఉన్న మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ హైవేపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అతివేగం వద్దని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -