Thursday, May 7, 2026
E-PAPER
Homeజాతీయంప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రతిపక్షంలో కూర్చుంటాం: స్టాలిన్

ప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రతిపక్షంలో కూర్చుంటాం: స్టాలిన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన బాధ్యతను గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేయడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే సంప్రదాయం డీఎంకేది కాదని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా, పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు మద్దతిచ్చే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఐక్యత ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.

తమిళనాడు అభివృద్ధిని కాంక్షించే వారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యాంగ సంక్షోభానికి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదని అన్నారు. డీఎంకే ఎప్పుడూ ప్రజల వైపు ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -