Friday, May 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకు అండగా ఎన్‌ఎఫ్‌బీఎస్‌

పేదలకు అండగా ఎన్‌ఎఫ్‌బీఎస్‌

- Advertisement -

కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సాయం
2025-26లో 15,420 మంది లబ్దిదారులు
ప్రత్యేక దష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పేద కుటుంబాల్లో ఆర్థిక ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పడకుండా వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 1995లో నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీమ్‌ (చీఖీదీూ)ను తీసుకొచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఈ పథకం నిర్లక్ష్యానికి గురైంది. ఈ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దష్టి పెట్టడంతో రెండున్నర ఏండ్లలో భారీ సంఖ్యలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందింది. 2022-23లో కేవలం 603 మందికి మాత్రమే సాయం అందగా, 2023-24లో 577 మందికి మాత్రమే ప్రయోజనం కలిగింది. 2014-15 నుంచి 2024-25 వరకు మొత్తం 20,663 మంది లబ్ధిదారులకు సాయం అందగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 15,420 మంది లబ్ధిదారులకు రూ.30.84 కోట్ల ఆర్థిక సహాయం అందింది.

అర్హులు దరఖాస్తు చేసుకోండి : పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క
రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగి అర్హులైన బీపీఎల్‌ కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్త చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క కోరారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. పేద కుటుంబాలకు కష్టసమయంలో భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమననీ, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

కావలసిన పత్రాలు
8బీపీఎల్‌ సర్టిఫికేట్‌
8కుటుంబ పోషకుడి మరణ ధవీకరణ పత్రం
8గుర్తింపు పత్రం( ఆధార్‌, రేషన్‌ కార్డు మొదలైనవి)
8మరణించిన వారి వయస్సు ధవీకరణ పత్రం.

అర్హతలు
8మరణించిన వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
8మరణించిన ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలి
8సహజ, ప్రమాదవశాత్తు మరణాలు రెండింటినీ కవర్‌ చేస్తుంది.
8మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
8ఆఫ్‌లైన్‌లో అయితే… స్థానిక తహసీల్దార్‌, సబ్‌-డివిజనల్‌ అధికారి లేదా సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -