Friday, May 8, 2026
E-PAPER
Homeఆటలుహనీట్రాప్.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక

హనీట్రాప్.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో హనీట్రాప్ ముప్పు పొంచి ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అనుమానం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, హోటల్ రూమ్‌లలోకి అనుమతి లేని వ్యక్తులను తీసుకురావద్దని సూచించారు. నియమావళి ఉల్లంఘిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. ఆటగాళ్ల ప్రవర్తనపై నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. డగౌట్లు, బస్సులు, హోటళ్ల వద్ద ఆటతో సంబంధం లేని వ్యక్తులు తిరుగుతున్నారని అవినీతి నిరోధక విభాగం నివేదిక ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -