- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజున అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆయనకు చోటు లభించింది. ఈ ఘనత సాధించిన 12వ భారతీయుడిగా, పదో భారత పురుష క్రికెటర్‌గా గంగూలీ నిలిచారు. ఈ సంతోషాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “నన్ను హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంపిక చేసినందుకు ఐసీసీకి, ఛైర్మన్ జై షాకు ధన్యవాదాలు. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. ఎందరో దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరడం సంతోషంగా ఉంది” అని గంగూలీ పేర్కొన్నాడు. జూలై 11న స్కాట్లాండ్‌లో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
- Advertisement -



