Saturday, May 9, 2026
E-PAPER
Homeజాతీయం'ఎక్స్' బయోలో మమతా బెనర్జీ కీలక మార్పు..

‘ఎక్స్’ బయోలో మమతా బెనర్జీ కీలక మార్పు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ బయోను మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఖండించిన కొద్ది రోజులకే ఈ మార్పు జరగడం గమనార్హం.గతంలో మమత బయోలో “తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్‌పర్సన్. గౌరవనీయ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అని ఉండేది. అయితే, ఇప్పుడు దానిని అప్‌డేట్ చేశారు. కొత్త బయోలో “తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్‌పర్సన్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ)” అని స్పష్టంగా పేర్కొన్నారు. వరుసగా మూడుసార్లు తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన విషయాన్ని (15, 16, 17వ విధానసభలకు) నొక్కి చెప్పడం ద్వారా, తాను పదవిలో కొనసాగుతున్నానని, తప్పుకునే ప్రసక్తే లేదని ఆమె పరోక్షంగా బలమైన సందేశం పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -