నవతెలంగాణ – హైదరాబాద్ : పెండ్లి విందులో పెట్టిన స్వీట్లు తిని 105 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలో జరిగింది. విరాట్‌నగర్ ఏరియాలో ఉన్న ధని గస్కాన్ గ్రామంలో జరిగిన పెళ్లి విందులో పెట్టిన స్వీట్లు తిన్న తర్వాత ఆ గ్రామానికి చెందిన 105 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఫంక్షన్ కోసం రస్‌మలై తయారు చేశారు. గురువారం రాత్రి ఆ స్వీట్‌ను గ్రామస్థులకు పంచారు. స్వీటు తిని అనారోగ్యానికి లోనైన వారిని అటేలేలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అడ్మిట్ చేశారు. తదుపరి చికిత్స కోసం వాల్లను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. సరైన సమయంలో అందరికీ చికిత్స అందించినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ కపిల్ కుమార్ ఉపాధ్యయ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆహార శ్యాంపిళ్లను సేకరించింది. ల్యాబ్‌కు పంపించారు.
స్వీట్లు తిని 105 మందికి తీవ్ర అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



