నేడు తమిళనాడు సీఎంగా ప్రమాణం మరో తొమ్మిది మంది మంత్రులు కూడా
13న విశ్వాస పరీక్ష 120 మంది మద్దతుతో గవర్నర్ అంగీకారం
మా పథకాలను కొనసాగించండి : స్టాలిన్
చెన్నై : ఎట్టకేలకు అన్ని రకాల అడ్డంకులు, అనిశ్చితులు తొలగి తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు, టీవీకే అధ్యక్షులు సి.జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 9మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఈ నెల 13లోగా అసెంబ్లీ వేదికగా విశ్వాస పరీక్ష జరగనుంది. గత కొన్ని రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి దీంతో తెర పడింది. గత నాలుగు రోజులుగా వరుసగా నాలుగుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్ శనివారం సాయంత్రానికి గ్రీన్ సిగల్ లభించింది. 234మంది సభ్యులు గల సభలో తనకు 120మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొంటూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిదిగా గవర్నర్ ఆర్లేకర్‌ను విజయ్ కోరారు. దాంతో రాజ్యాంగంలోని 164వ సెక్షన్ కింద ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే చీఫ్ విజయ్ ను చీఫ్ మినిస్టర్ డిజిగేట్‌గా గవర్నర్ నియమించారు. టీవీకేకు బేషరతుగా మద్దతునిస్తున్నామని వీసీకే, ఐయూఎంఎల్ ప్రకటించిన అనంతరం విజయ్, గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్, వీసీకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం పార్టీల బలాబలాలు : టీవీకే (108), కాంగ్రెస్ (5), సీపీఐ(ఎం)(2), సీపీఐ(2), వీసీకే(2), ఐయూఎంఎల్(2) మద్దతు ప్రకటించాయి. విజరు రెండు స్థానాల్లో గెలుపొందడంతో ఒక ఓటే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో, విజయ్ ను బలపరుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 120గా ఉంది.
టీవీకే హెడ్‌క్వార్టర్స్‌లో సంబురాలు
తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాగానే పెద్ద సంఖ్యలో టీవీకే కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు పార్టీ హెడ్‌క్వార్టర్స్ బయట బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. లోక్‌భవన్‌కు వెళ్లినపుడు తమ నేతను చూసేందుకు అక్కడ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
డీఎంకే పథకాలను కొనసాగించండి : స్టాలిన్
డీఎంకే ప్రభుత్వం ముందుచూపుతో, పక్కా ప్రణాళికగా అమలు చేసిన పథకాలను కొనసాగించాల్సిందిగా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్న, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అవి కొనసాగిస్తే అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందుతారని తెలిపారు.
ఇంకా డీఎంకే కూటమిలోనే : వీసీకే చీఫ్
టీవీకేకు మద్దతునందించిన అనంతరం వీసీకే చీఫ్ తిరుమవలవన్ మాట్లాడుతూ 108 స్థానాలు సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డంకి కారాదని భావించామని, రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించకుండా నివారించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీఎంకే కూటమితో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీగా మాకున్న స్వతంత్ర హక్కును ఉపయోగించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనివల్ల డీఎంకేతో తమ సంబంధం దెబ్బతిన్నదన్నారు.
లోక్‌భవన్‌కు వచ్చి తిరిగి వెళ్లిపోయి…
వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లభించిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు విజరు లోక్‌భవన్‌కు వెళ్ళారు. అక్కడ ఆయనకు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించలేదు. దాంతో ఆయన వెనుదిరిగారు.
గవర్నర్ తీరుపై ఆగ్రహం
నాలుగు రోజుల పాటు అనిశ్చితి సష్టించిన గవర్నర్ ఎట్టకేలకు విజరు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాల్సి వచ్చింది. చట్టసభల్లో నిరూపించుకోవాల్సిన మెజారిటీ వివరాలను తనకు ముందే సమర్పించాలంటూ తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దేశమంతటా రాజ్యాంగ నిపుణులు గవర్నర్ తీరును నిరసించారు. గత సాంప్రదాయాల ప్రకారం అత్యధిక స్థానాలు సాధించిన టివికెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ మినహా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోయినా… చివరి నిమిషం వరకూ ఆయన సీఎం కాకుండా అడ్డుకోవడానికి గవర్నర్ అన్ని ప్రయత్నాలు చేయడం గమనార్హం. బీజేపీ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మెజారిటీ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆదివారం విజరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విజయ్ కి లైన్ క్లియర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



