Sunday, May 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబండికి సన్‌స్ట్రోక్‌

బండికి సన్‌స్ట్రోక్‌

- Advertisement -

కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు
పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు

మా కుమార్తెని లైంగిక వేధింపులకు గురిచేశాడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం ఆరు గంటల హైడ్రామా తర్వాత కేసు నమోదు..!
నాపై హనీట్రాప్‌ చేశారు : కరీంనగర్‌ స్టేషన్‌లో బండి సంజరు కొడుకు భగీరథ్‌ ఫిర్యాదుొ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం

నవతెలంగాణ-కొంపల్లి/ కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
బాలికపై లైంగికవేధింపుల ఆరోపణలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు కుమారుడిపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలికను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌ లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలి తల్లి శుక్రవారం రాత్రి పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం, బాధిత బాలికకు బండి భగీరథ్‌తో గత ఏడాది కాలంగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బాలికపై అతను లైంగికదాడికి యత్నించాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఈ ఘటనల కారణంగా బాలిక మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిపింది. కాగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భగీరథ్‌పై కేసు నమోదు నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆరు గంటల హైడ్రామా తర్వాత కేసు నమోదు..!
ఇదిలా ఉంటే, తన కుమారుడిపై కేసు నమోదు కాకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచిన అనంతరం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్టు సమాచారం. దీనిపై శనివారం ఉదయం నుంచి మీడియాలో వార్తలు రావడంతో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఇక గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా బండి భగీరథ్‌పై వివాదాస్పద ఆరోపణలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఓ సహ విద్యార్థినిపై దాడి ఘటనలో కూడా ఆయన పేరు వినిపించిన సంగతి తెలిసిందే.

నాపై హనీట్రాప్‌ చేశారు : బండి సంజరు కొడుకు భగీరథ్‌ ఫిర్యాదు
స్నేహితులతో కలిసి తనతో పరిచయం పెంచుకుని స్నేహం పేరుతో సన్నిహితంగా ఉంటూ తనపై హనీట్రాప్‌ చేశారని, కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజరు కుమారుడు భగీరథ్‌ కరీంనగర్‌ స్టేషన్‌లో ఈనెల 8న సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. తన కూతురుకు మద్యం తాగించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని భగీరథ్‌పై బాధితురాలి తల్లి హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోక్సో కేసు నమోదు చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో భగీరథ్‌ ముందు రోజే కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడన్న ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇప్పుడు బయటకి రావడం గమనార్హం.

డబ్బుల కోసమే కుట్రలు
సదరు బాలిక సహా ఆమె కుటుంబమంతా తనతో పుణ్యక్షేత్రాలకు కలిసి వచ్చారని, తీరా తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే లైంగిక, వేధింపుల కేసులు పెడతామని బెదిరింపులకు దిగారంటూ భగీరథ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను భయపడి రూ.50 వేలు ఇస్తే, ఏకంగా రూ.5 కోట్లు కావాలంటూ, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆమె బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించిందంటూ తెలిపాడు. ఈ కుటుంబం ఇలాంటి మోసాలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదని, తన స్నేహితుల్లో కొందరికి కూడా వీరితో ఇలాంటి అనుభవమే ఎదురైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏప్రిల్‌ 21, 2026న సదరు బాలికపై నిర్మల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఇదే తరహా వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని భగీరథ్‌ పేర్కొనడం గమనార్హం. ఏదేమైనా కేంద్ర మంత్రి కొడుకుపై నమోదైన మైనర్‌పై లైంగికదాడి కేసు నేపథ్యంలో సదరు భగీరథ్‌కూడా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -