Sunday, May 10, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం

బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం

- Advertisement -

హాజరైన ప్రధాని మోడీ,
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు

కోల్‌కతా : బెంగాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. బెంగాల్‌ 9వ ముఖ్యమంత్రిగా శనివారం సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు ఇప్పుడు ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టడం గమనార్హం. బీజేపీ శాసనసభ్యులు దిలీప్‌ ఘోశ్‌, అగ్నిమిత్రా పాల్‌, అశోక్‌ కీర్తనియా, నితీశ్‌ ప్రామాణిక్‌, క్షుదిరామ్‌ టుడూ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -