ఓ భారతీయుడు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
టెహ్రాన్ : హార్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులతో వెళ్తున్న ఓ చెక్క పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెక్క పడవ దుబారు నుంచి యెమెన్‌లోని ముక్కంకు బయలుదేరింది. ఇందులో 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అమెరికా- ఇరాన్ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో భాగంగా ఈ పడవ పైనా కాల్పులు జరపడంతో మంటలు చెలరేగి పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. దీన్ని గుర్తించిన అటుగా వెళ్లిన మరో పడవలోని వారు కాలుతున్న పడవలోని సిబ్బందిని రక్షించి వారందరినీ దుబారు పోర్టుకు తరలించారు. అనంతరం గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో వైద్యచికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని అల్తాఫ్ తలబ్ కేర్‌గా గుర్తించారు. ఇంజిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన గుజరాత్‌లోని ద్వారకాకు చెందినవాడని తెలుస్తోంది. సముద్రంలో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని దుబారులోని భారత్ కాన్సులేట్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పడవ యజమానితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
హార్ముజ్ సమీపంలో చెక్క పడవలో మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



