Monday, May 11, 2026
E-PAPER
Homeసినిమాపక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌

పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

అగ్ర కథానాయకుడు సూర్య నటించిన మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీని అనేక విజయవంతమైన చిత్రాల నిర్మాణంతో మంచి పేరును సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది అని మేకర్స్‌ తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్‌ కంటెంట్‌ను అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని స్కేల్‌, కంటెంట్‌ రెండింటినీ దష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, సాంగ్స్‌ భారీ అంచనాలని సష్టించాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇంద్రన్స్‌, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈనెల 14న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన- దర్శకత్వం: బాలాజీ, సినిమాటోగ్రఫీ – జికె విష్ణు, సంగీతం – సాయి అభ్యంకర్‌, యాక్షన్‌- అన్బరివ్‌, విక్రమ్‌ మోర్‌, ఎడిటర్‌ – ఆర్‌.కళైవానన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – అరుణ్‌ వెంజారామూడు, నిర్మాతలు: ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -