మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అందరిలోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. రాజసం ఉట్టి పడేలా కిరీటీం, మీసం, డిఫరెంట్ వేషధారణతో భాగ్య శ్రీ ఉన్న లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ లుక్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి? సినిమాలో ఈ పోస్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అన్నది త్వరలోనే తేలనుంది. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ, సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్, రచన -దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు, మ్యూజిక్ : థమన్ ఎస్, ఎడిటర్ – నవీన్ నూలి.



