- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని పాలకొండ చౌరస్తాలో చోటు చేసుకుంది. కారు యూటర్న్ తీసుకుంటుండగా స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



