– కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు…
నవతెలంగాణ – ముధోల్: మక్కలు కొనుగోలు చేసిన రోజులు గడుస్తున్న సంచులను గోదాములకు తరలించకపోవడంతో సహనం నశించిన రైతులు బాసర- బైంసా రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో గత నెలలో మక్కా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక రైతులు తాము పండించిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అయితే విక్రయించిన మొక్కజొన్నను సంచులను అధికారులు గోదాములకు తరలించాలి. అయితే తరలించకపోవడంతో గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో సంచులు తడిసిపోయాయ్యని రైతులు పేర్కొంటున్నారు.
వందలా సంచులు కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్నాయని రైతులు వాపోయారు. తక్షణమే సంచులను వెంటనే గోదాములకు తరలించాలని వారు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ తన సిబ్బందితో ఆందోళన వద్దకు చేరుకున్నారు. రైతులను సముదాయించారు. సంబంధిత అధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని రైతులు స్పష్టం చేశారు. తాసిల్దార్ కు, పిఎసిఎస్ సిఇఓ కు ఫోన్ లో సమాచారం చేరవేశారు.
వెంటనే పిఎసిఎస్ సిఇఓ భూమయ్య ఆందోళన వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులను సముదాంచి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని మార్క్ఫెడ్ డిఎంకు ఫోన్లో తెలిపారు. డిఎం రైతులతో ఫోన్లో మాట్లాడిన రైతులు మాత్రం ఇక్కడ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై వాహనాలను దారి మళ్లించారు. రైతులు మాత్రం ఎండలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో సర్పంచ్ మోత్రే నారయణ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధికారి కైరి సాయి మోహన్, రైతులు పాల్గోన్నారు. ఈ క్రమంలో రాస్తారోకో వద్దకు తహశీల్దార్ శ్రీలత చేరుకుని వెంటనే లారీని పంపిస్తాడు హమీ ఇచ్చారు.



