Friday, July 10, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బడిలో విద్యార్థులు.. విధులకు రాని ఉపాధ్యాయులు

బడిలో విద్యార్థులు.. విధులకు రాని ఉపాధ్యాయులు

- Advertisement -

పాఠశాలలో పనిచేస్తున్న వ్యక్తితో విద్యాబోధన..
నవతెలంగాణ – కుభీర్

కుభీర్ మండలంలోని అంతర్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం ఇద్దరు ఉపాధ్యాయులు ఒకేసారి సెలవులో ఉండటంతో విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న  వ్యక్తి గురువుగా మారి పాఠాలు బోధించడంతో విద్యాశాఖ పర్యవేక్షణ తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధ్యాయుల హాజరు, సెలవుల సమన్వయంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన అనంతరం సీఆర్పీని పంపినట్లు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొంతుల సురేష్ వివరణ ఇచ్చారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. కాగా ముందస్తు చర్యలు చేపట్టడంలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ఇతర పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల సమన్వయం, అధికారుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని విద్యావంతులు సూచిస్తున్నారు.

పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ఉన్న ప్రధానోపాధ్యాయులను ఈ విషయమై వివరణ కోరగా.. అంతర్నీ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుండగా అందులో ఒక ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడు. మరో ఉపాధ్యాయుడు ఎలాంటి సమాచారం లేకుండా విధులకు హాజకు కాలేదని చెప్పారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు నివేదిక అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -