Friday, July 10, 2026
E-PAPER
Homeఖమ్మంఅంగన్వాడీ టీచర్లు, సహాయకుల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడీ టీచర్లు, సహాయకుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– డిమాండ్స్ డే సందర్భంగా వినతిపత్రం సమర్పణ
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

అంగన్వాడీ టీచర్లు, సహాయకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 45 వ ఐఎల్‌సీ సిఫార్సుల మేరకు కనీస వేతనాన్ని రూ.18 వేలు గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్స్ డే సందర్భంగా శుక్రవారం ప్రాజెక్ట్ కార్యాలయంలో అటెండర్‌ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఐసీడీఎస్‌లో పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న టీచర్లకు బీఎల్‌ఓ విధులు అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించడంతో పాటు చట్టబద్ధమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మురారి రఘు, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకురాలు వెంకటరమణ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -