- Advertisement -
చైర్మన్గా పున్న ధర్మేందర్
నవతెలంగాణ – చండూరు
చండూరు చేనేత సహకార సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో చండూరు పద్మశాలి సంఘం ప్యానల్ ఘన విజయం సాధించింది. చైర్మన్గా పున్న దర్మేందర్ ఎంపిక లంచన ప్రయంగా మారింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో పున్న దర్మేందర్, గంజి అశోక్, చెరుపల్లి కృష్ణ, కోమటి ఓంకారం, ఏలే శ్రీనివాస్, తిరందాస్ నర్సింహా, జూలూరు వెంకటేష్ గెలుపొందారు. కాగా ఇప్పటికే తిరందాస్ సుధా,గుర్రం కవిత ఏక గ్రీవంగా ఎంపిక అయ్యారు. దింతో పున్న ధర్మేందర్ అధ్యక్ష పదవి లంచన ప్రయంగా మారింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 749 ఓట్లకు గాను 669 ఓట్లు పోలయ్యాయి. 32 ఓట్లు కాలిపోయాయి.రేపు ఉదయం కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరగనుంది.
- Advertisement -



